శరత్ బాబు గారికి మా దక్ష సినిమా అంకితం –
-శరత్ బాబు అబ్బాయి ఆయుష్ హీరో గా రూపుదిద్దుకుంటున్న” దక్ష”
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ పైన తల్లాడ శ్రీనివాస్ నిర్మాత గా ,తల్లాడ సాయికృష్ణ కో ప్రొడ్యూసర్ గా చేస్తున్న సినిమా ” దక్ష”.
వివేకానంద విక్రాంత్ దర్శకుడు.
ప్రముఖ నటుడు శరత్ బాబు గారి తనయుడు ఆయుష్ తేజస్ హీరో గా చేస్తున్న సినిమా దక్ష.
కో ప్రొడ్యూసర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ
శరత్ బాబు గారు,తనికెళ్ళ భరణి గారు ఇద్దరు మా సినిమా కి మొదటి నుండి సపోర్ట్ చేసారు. ప్రస్తుతం దక్ష సినిమా
పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో ఉంది, ఎంతో ఫాస్ట్ గా చేస్తున్నప్పటికీ సినిమా ని శరత్ బాబు గారికి చూపించలేక పోయాను అనే బాధ కలుగుతుంది, అసలు శరత్ బాబు గారు లేరు అనే వార్త తట్టుకోలేక పోతున్నాం, ఎప్పుడు చిరునవ్వుతో పలకరించే వారు, వారి అబ్బాయి ఆయుష్ ని ఎలా ప్రేమ గా చూసుకుంటారో మా టీం అందరిని అలానే పలకరించే వారు, ఇప్పుడు వారు లేని వార్త యావత్ చిత్ర పరిశ్రమకి చేదు వార్త, మా సినిమా ని శరత్ బాబు గారికి అంకింతం చేస్తున్నాం, వారికి కుంటుబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం , ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.