Movie News

శివరాజ్ కుమార్ నటించిన “బజరంగీ-2” మూవీ టీజర్ కు అద్భుత స్పందన

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన కొత్త
చిత్రం “బజరంగీ-2” టీజర్ రిలీజ్ అయింది. ఈ మూవీ 2013 లో వచ్చి పెద్ద హిట్
అయిన ” బజరంగీ ” చిత్రానికి సీక్వెల్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ
టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కన్నడ చిత్రమే అయిన కానీ పాన్
ఇండియా చిత్రం లాగా బాలీవుడ్ తో సహా అన్ని సౌత్ భాషల వాళ్ళు ఈ చిత్ర
టీజర్ ను ఆన్ లైన్ లో షేర్ చేస్తూ టీజర్ భలే ఉందంటూ మెచ్చుకోవడం విశేషం.ఈ
రెస్పాన్స్ చూసి దర్శక నిర్మాతలు ఈ సినిమా ను పాన్ ఇండియా లెవెల్ లో
రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.త్వరలోనే తెలుగు లో కూడా ఈ సినిమా డబ్
కానుంది.టీజర్ చూసి పలువురు ప్రొడ్యూసర్ లు, డిస్ట్రిబ్యూటర్ లు ఈ సినిమా
డబ్బింగ్ రైట్స్ కోసం ఎంక్వైరీ చేశారు.

టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ గురుంచి హీరో శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ :
2013 లో మేము తీసిన “బజరంగీ” పెద్ద హిట్ కావడం తో దానికి సీక్వెల్ గా ఈ
“బజరంగీ-2” మూవీ భారీ గా తీయాలని భావించాం. కానీ ఈ టీజర్ కు ఇంత
రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు.అన్ని ఇండస్ట్రీ ల నుండి కాల్స్
వస్తున్నాయి. ఈ అద్భుతమైన రెస్పాన్స్ కి అందరికీ ధన్యవాదాలు.” అన్నారు.

“బజరంగీ-2” టీజర్ విజువల్ గా అద్భుతంగా ఉంది.బాక్ గ్రౌండ్
స్కోర్,గ్రాఫిక్స్ షాట్స్ చూస్తుంటే మరో “కెజిఎఫ్” తరహా సినిమా కాబోతుంది
అనిపిస్తుంది.పీరియాడిక్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ
లో శివరాజ్ కుమార్ సరసన భావన హీరోయిన్ గా నటిస్తుంది. జయన్న ఫిలిమ్స్
బ్యానర్ పై జయన్న మరియు భోగేంద్ర కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ ని ఎ.హర్ష
డైరెక్ట్ చేశారు.థియేటర్ లు ఓపెన్ అవ్వగానే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా
రిలీజ్ కాబోతుంది.

*Terrific response for Shivaraj Kumar’s Bhajarangi 2″ Teaser.*

The Teaser of the Kannada film “Bhajarangi-2” was released earlier
today on the occasion of Hero Shivaraj Kumar’s birthday. This film is
a sequel to the Kannada film Bhajarangi which released in 2013.
The makers of the film this time planned the sequel on a larger scale
and a bigger budget.

The film however was only made to be released in the Kannada language.

But Something surprising happened, The teaser was released in a few
Kannada social Media handles in the morning and the response was so
amazing that social media handles all over the country picked up the
teaser and started posting it.
The teaser has become viral among all the film industries in the country.

Many leading Tollywood & Kollywood film personalities have expressed
interest in seeing this film released in the Telugu dubbed version due
to its scale, the visual appeal, the art direction and the background
score. Many are saying this film has PAN India potential like the
previous huge Kannada film KGF.

Talking about the teaser response Hero Dr. Shiva Raj Kumar said

“As Bhajarangi was a big success, We thought of making this film at
big scale and did our best, never thought it would go viral all over
the country like this. This is one of the best gifts I have gotten for
my birthday. Getting a amazing response from many film industries. I
thank everyone for the great response.”

The makers are pleasantly surprised and overwhelmed by the response
and say that they will confirm about the PAN india release after the
theatres open up. They have also confirmed getting many calls from
other film industries from distributors to negotiate rights for dubbed
release.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close