డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. మీనబజార్., టీజర్, ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమం మంగళవారం జరిగింది. హీరో మధు సుధన్, హీరోయిన్ శ్రీజిత ఘోష్,  నిర్మాతలు సి.కళ్యాణ్, రామసత్యనారాయణ ముఖ్య అథితులుగా పాల్గొన్నారు.
మీడియా మిత్రులు స్టిల్ ఫోటోగ్రఫర్స్ ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. మీనా బజార్., చిత్ర ప్రమోషన్స్ ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర సభ్యులు.
ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతు..
మీనా బజార్., టీజర్ బాగుంది. ఈ చిత్రం మంచి సక్సెస్ అయ్యి పార్ట్ 2 కూడా రావాలని కోరుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనలు ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. మంచి చిత్రాలు ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ మీనా బజార్ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు.
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ..
ఈ చిత్ర టీజర్ చూస్తుంటే అర్థం అవుతుంది వీరు ఎంత గ్రాండ్ గా సినిమా తీశారో. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. తప్పకుండా ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తాయి. కంటెంట్ బాగున్న చిన్న సినిమాలు సక్సెస్ అవ్వడం సహజమే. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్న అన్నారు.
డైరెక్టర్ రానా సునీల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..
నేను కన్నడలో ఒక సినిమా చేశాను. తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది. మంచి కథతో ఈ సినిమాను తీసాను. హీరో హీరోయిన్ బాగా చేశారు. మాకు నిర్మత సి.కళ్యాణ్ గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు వారికి ధన్యవాదాలు. టీజర్ బాగుందని అందరూ అంటున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియజేస్తాము అన్నారు.
హీరో మధుసూదన్ మాట్లాడుతూ…
మన చుట్టూ జరిగే సంఘటనలు ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ సబ్జెక్ట్ కు కనెక్ట్ అవుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సునీల్ కుమార్ సింగ్ గారికి ధన్యవాదాలు అన్నారు.
హీరోయిన్ శ్రీజిత ఘోష్ మాట్లాడుతూ…
నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాలో నా పాత్ర మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కావాలి. మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
*నటీనటులు:*
వైభవీ జోషి
శ్రీజిత ఘోష్
మధుసూధన్
రాజేష్ నటరంగ
రానా సునీల్ కుమార్ సింగ్
 మధు సుధన్
 శ్రీజిత ఘోష్
అరవింద్ రావ్
 జీవ
 మనిత
వేణుగోపాల్
*సాంకేతిక నిపుణులు:*
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం: రానా
 సునీల్ కుమార్ సింగ్
నిర్మాత: నాగేంద్ర సింగ్
కెమెరామెన్: మ్యాథీవ్
సంగీతం: కద్రీ మనికాంత్
ఎడిటర్: శ్రీకాంత్
కొరియోగ్రాఫర్: సుజి, అని, కల్పన్
ఫైట్స్: రియల్ సతీష్
పి.ఆర్.ఓ: మధు విఆర్
Spread the love