యూత్ ని టార్గెట్ చేస్తూ రూపొందిన రాయలసీమ లవ్ స్టొరీ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది యువత నుండి. సెప్టెంబర్ 27 న విడుదలైన రాయలసీమ లవ్ స్టొరీ చిత్రాన్ని బిసి కేంద్రాల్లోని ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. యువతకు కావాల్సిన మసాలా పుష్కలంగా ఉన్న ఈ చిత్రానికి రామ్ రణధీర్ దర్శకత్వం వహించగా పంచలింగాల బ్రదర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
వెంకట్ , హృశాలి , పావని హీరో హీరోయిన్ లుగా నటించగా వెంకట్ – హృశాలి ల మధ్య వచ్చే శృంగార సన్నివేశాలు యువతను విశేషంగా అలరిస్తున్నాయి. తెలంగాణ , రాయలసీమ , ఆంధ్రా అనే తేడా లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలలోని బిసి కేంద్రాల్లో ఆదరణ లభిస్తుండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దర్శక నిర్మాతలు పంచలింగాల బ్రదర్స్ , రామ్ రణధీర్ లు. ఎంటర్ టైన్ మెంట్ తో పాటుగా పాటలు కూడా రాయలసీమ లవ్ స్టొరీ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి.
Spread the love